ఆ మందు పాట వెనుక ఆసక్తికర సంఘటన !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో పవన్ తప్ప మరొకరికి పేరు రాదు. పవన్ క్రేజ్ ముందు ఎవ్వరు వెండితెర పై వెలుగులు చిమ్మలేరు. కానీ ‘గబ్బర్‌సింగ్‌’ సినిమాలో కోట మెరుపులు మెరిపించారు. నటుడిగా కోట శ్రీనివాసరావు ప్రతిభ గురించి కొత్తగా ముచ్చటించుకొక్కర్లేదు. తెలుగువాళ్ళందరికీ ఆయన నేటి మేటి నటుడు అని ఎరుకే. కానీ ఆయనలో మంచి పాటగాడు కూడా ఉన్నాడని రుజువు చేసిన ఘనత హరీష్ శంకర్ కే దక్కుతుంది. ‘మందుబాబులం మేము మందు బాబులం, […]

Written By: admin, Updated On : July 5, 2021 7:22 pm
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో పవన్ తప్ప మరొకరికి పేరు రాదు. పవన్ క్రేజ్ ముందు ఎవ్వరు వెండితెర పై వెలుగులు చిమ్మలేరు. కానీ ‘గబ్బర్‌సింగ్‌’ సినిమాలో కోట మెరుపులు మెరిపించారు. నటుడిగా కోట శ్రీనివాసరావు ప్రతిభ గురించి కొత్తగా ముచ్చటించుకొక్కర్లేదు. తెలుగువాళ్ళందరికీ ఆయన నేటి మేటి నటుడు అని ఎరుకే. కానీ ఆయనలో మంచి పాటగాడు కూడా ఉన్నాడని రుజువు చేసిన ఘనత హరీష్ శంకర్ కే దక్కుతుంది.

‘మందుబాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం…’ అంటూ సాగిన ఈ మందు పాట కోట నోట రావడం ఆలస్యం, జనాల నోట్లో కొన్ని ఏళ్లపాటు నానిపోయింది. అసలు ఈ పాట వెనుక ఏమి జరిగిందో కోట ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కోట ఏదో సినిమా షూటింగ్‌ కోసం అనుకుంటా. హడావిడిగా రెడీ అవుతున్నారు.

సడెన్ గా కోటకు ఫోన్ వచ్చింది. ‘సార్‌… హరీశ్‌ శంకర్‌గారు’ అనేలోపే కోట ఉత్సాహంగా ఫోన్ తీసుకుని ‘హలో.. ఏంటబ్బాయ్‌.. హా’ అంటూ సరదాగా ముచ్చట పెట్టేలోపే ‘ఏం లేదు బాబాయ్‌, మీకు ఇవాళ ఏమైనా షూటింగ్‌ ఉందా?’, ‘ఉంటే ఏమి, నువ్వు రమ్మంటే నేను వస్తాను’ అన్నాడు కోట. కట్ చేస్తే కోట కారు హైదరాబాద్‌ లోని ప్రసాద్‌ ల్యాబ్‌ లోకి ఎంటర్ అయింది.

హరీశ్‌ శంకర్‌ స్పీడ్ గా వచ్చి, రిసీవ్ చేసుకుని రికార్డింగ్‌ స్టూడియోలోకి తీసుకువెళ్లాడు. కోట అనుమానంగా రికార్డింగ్‌ రూమ్‌ తలుపు తీస్తే అక్కడ దేవిశ్రీప్రసాద్‌ నవ్వుతూ కనిపించాడు. రండి కోటగారు, ఎలా ఉన్నారు ? అంటూ కుశల ప్రశ్నలు అడుగుతూనే మధ్యలో మందు బాబులం పాట ప్లే చేసి ‘ఇప్పుడు ఈ పాట మీరు పాడుతున్నారు’ అంటూ లిరిక్స్ పేపర్ చేతిలో పెట్టి పక్కకి వెళ్ళిపోయాడు.

కోటకు విషయం అర్థం కాలేదు. కానీ వాళ్ళ హడావిడి చూసి టెన్షన్ గానే ఆ పాటను పాడటానికి పైకి లేచాడు. గంట సమయం గడిచిపోయింది. పాట రికార్డింగ్‌ కూడా పూర్తయింది. కట్ చేస్తే ఆడియో రిలీజ్ అయింది. కోట పాట కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది.