https://oktelugu.com/

జలజగడంపై కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జలజగడం మొదలైంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో ప్రారంభమైన వివాదం రచ్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి, తెలంగాణ రాష్ర్టం అనుమతులు లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాయడంతో తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై సమాధానం చెప్పాలని కోరింది. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ నుంచి తెలంగాణ రాష్ర్టం ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ నిలిపివేయాలని సూచించింది. కృష్ణా బోర్డు […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 5, 2021 / 07:04 PM IST
    Follow us on

    ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జలజగడం మొదలైంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో ప్రారంభమైన వివాదం రచ్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి, తెలంగాణ రాష్ర్టం అనుమతులు లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాయడంతో తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై సమాధానం చెప్పాలని కోరింది. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ నుంచి తెలంగాణ రాష్ర్టం ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ నిలిపివేయాలని సూచించింది.

    కృష్ణా బోర్డు రాసిన లేఖపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం తన వైఖరిని తెలియజేసింది. తెలంగాణ రాష్ర్ట నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ బోర్డు చైర్మన్ కు రాసిన లేఖలో శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించిన సమయంలో ప్లానింగ్ కమిషన్, కృష్ణా మొదటి ట్రిబ్యునల్ పూర్తి స్థాయిలో విద్యుత్ వినియోగానికి అనుమతి ఇచ్చిందని తెలిపారు. దీనికి అనుగుణంగానే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు.

    జల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మాత్రమే ప్రాజెక్టులోని నీటిని ఉఫయోగించాలని ఇతరఅవసరాలకు మళ్లించడానికి వీలు లేదని గతంలో ప్రణాళిక సంఘం చెప్పిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1991 నుంచి ఇప్పటి వరకు ఏప్రిల్, మే నెలల్లో ఏ రోజు కూడా నీటి మట్టం 834 అడుగులకు పైగా ఉండేలా చూడలేదన్నారు. ప్రస్తుతం 854 అడుగుల పైన ఉండాలని అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు.

    ఏఫీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. తెలంగాణ రాష్ర్టం విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే ఏపీకి నష్టం జరుగుతుందని చెప్పడం అవాస్తవమని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం నుంచి ఆ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో 50:50 నిష్పత్తిలో విద్యుత్ పంచాలని విభజన చట్టంలో లేదని పేర్కొన్నారు.

    ఆంధ్రప్రదేశ్ రెండేళ్లుగా 170 టీఎంసీలు 120 టీఎంసీలు బేసిన్ వెలుపలకు తరలించిందన్నారు. పెన్నా బేసిన్ లో 360 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు కట్టిందన్నారు. చెన్నై తాగునీటి కోసం 10 టీఎంసీలు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. కృష్ణ జలాల్లో తెలంగాణ వాటా ప్రకారమేవినియోగించుకుంటున్నామన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో లింకుపెట్టి ఆరోపణలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం తీరుపై అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.