
ఏపీలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సైతం వైరస్ వేగంగా విస్తరిస్తోంది. నిన్న ఒక్కరోజే ఏకంగా 10759 కేసులు నమోదు కావడం పరిస్థికి అద్దం పడుతోంది. సామాన్యులే కాకుండా రాజకీయ ప్రముఖులు కరో్నా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ పరీక్షలు చేయించుకున్నానని టెస్టుల్లో పాటిటివ్ అని తెలిందని వెల్లడించారు.