
ఆక్సిజన్ కొరత సమస్యను పరిష్కరించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురాకపోతే మహా విషాదం తప్పదని హెచ్చరించారు. శుక్రవారం ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ఉన్నత స్ధాయి సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాన మోదీ శుక్రవారం కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన ఉన్నత స్ధాయి సమావేశంలో కేంద్ర హొం మంత్రి అమిత షా, నీతి ఆయోగ్ హెల్త్ మెంబర్ వీకే పాల్ తదితరులు పాల్గొన్నారు.