Telugu News » Ap » Corona fear couple commits suicide
కరోనా భయం.. ఉరేసుకొని దంపతుల ఆత్మహత్య
కరోనా భయంతో తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు పెరుగుతండటం ఆందోళన కలిగిస్తున్నది. కొవిడ్ సోకిందన్న భయంతో తీవ్ర మనస్తాపానికి గురై దంపతులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పెడన గ్రామంలో గురువారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లీలాప్రసాద్ (40) భారతీ (38) ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తమకు కరోనా సోకిందన్న భయంతో నాటి నుంచి తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో దంపతులు […]
కరోనా భయంతో తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు పెరుగుతండటం ఆందోళన కలిగిస్తున్నది. కొవిడ్ సోకిందన్న భయంతో తీవ్ర మనస్తాపానికి గురై దంపతులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పెడన గ్రామంలో గురువారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లీలాప్రసాద్ (40) భారతీ (38) ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తమకు కరోనా సోకిందన్న భయంతో నాటి నుంచి తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో దంపతులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.