
దేశంలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. నిన్న 25 వేలకు చేరిన పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. మరో వైపు మరణాలు సైతం 600కు పైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 37,593 కొత్త కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 34,169 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి 24 గంటల్లో 648 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.99 శాతం ఉన్నాయని, ప్రస్తుతం దేశంలో 3,22,327 యాక్టివ్ కేసులున్నాయి.