
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం రోజురోజుకూ పెరుగుతున్నది. వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా మరణాలు పెరుగుతండటం ఆందోళన రేకెత్తిస్తున్నది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,434 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడిన 7,055 మంది కోలుకున్నారు. 64 మంది చనిపోయారు. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,54,875కి చేరింది. 9,47,625 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 99,446 కి పెరిగాయి 7800 మంది మరణించారు.