ఏపీకి చేరిన మరో లక్ష కొవిడ్ టీకాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో లక్ష కొవిడ్ టీకాలు అందాయి. హైదరాబాద్ నుంచి గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి కొవాగ్జిన్ డోసులను తరలించారు. టీకా నిల్వ కేంద్రం నుంచి జిల్లాల వారీగా వ్యాక్సిన్ ను తరలించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఏపీలో కొవిడ్ టీకాల నిల్వలు నిండుకున్నాయని, మరికొన్ని డోసులు కేటాయించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి జ్ఞప్తి చేసింది. ఈ మేరకు అదనపు టీకా డోసులను కేటాయించడంతో అవి ఇవాళ రాష్ట్రానికి […]

Written By: Suresh, Updated On : April 27, 2021 7:28 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో లక్ష కొవిడ్ టీకాలు అందాయి. హైదరాబాద్ నుంచి గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి కొవాగ్జిన్ డోసులను తరలించారు. టీకా నిల్వ కేంద్రం నుంచి జిల్లాల వారీగా వ్యాక్సిన్ ను తరలించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఏపీలో కొవిడ్ టీకాల నిల్వలు నిండుకున్నాయని, మరికొన్ని డోసులు కేటాయించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి జ్ఞప్తి చేసింది. ఈ మేరకు అదనపు టీకా డోసులను కేటాయించడంతో అవి ఇవాళ రాష్ట్రానికి చేరాయి.