
ఏపీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయని సానుకూల పరిస్థితి ఏర్పడిందని సీఎం జగన్ అన్నారు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఇంకా మెరుగుపడాల్సి ఉందని చెప్పారు. స్పందన కార్యక్రమంలో భాగంగా జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్ పోరాటంలో నిమగ్నమైన సిబ్బందికి అభినందనలు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు కావాలని సీఎం అన్నారు.