
బాలీవుడ్ లో ఒకప్పుడు శృంగార దేవత అంటే అందరికీ గుర్తుకు వచ్చే పేరు ‘మల్లికా షెరావత్’. ఆ తర్వాత ఎందుకో ఆమె పెద్దగా సినిమాల్లో రాణించలేకపోయింది. ‘మర్డర్’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినా ఆ తరువాత మెరుపులు మెరిపించలేకపోయింది, ఎవర్నీ మెప్పించలేకపోయింది. ఈ అందగత్తెను బాలీవుడ్ లీడింగ్ సినీ బృందం ఎంకరేజ్ చేయకపోగా డి గ్రేడ్ ఆర్టిస్ట్ గా పరిగణించిందట.
దాంతో మల్లికా షెరావత్ కి భవిష్యత్తు లేకుండా పోయింది. అయితే తన సినీ కెరీర్ లో జరిగిన అనేక సంఘటనల పై ఈ హాట్ బ్యూటీ స్పందించింది. ఆమె మాటల్లోనే ‘నెను ఎంట్రీ ఇచ్చిన కొత్తలో బాలీవుడ్ లో నాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అది నిజం. కారణం ఒక్కటే.. నాకు బాలీవుడ్ లో బ్యాక్ గ్రౌండ్ లేదు. లీడింగ్ లో ఉన్న వాళ్ళల్లో ఎవరూ కనీసం నాతో మాట్లాడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు.
స్టార్ డమ్ ఉన్న ఎవరో ఒకర్ని బాయ్ ఫ్రెండ్ గా చేసుకుంటే నాకు సినిమా ఆఫర్లు వచ్చి ఉండేవి. కానీ నేనెప్పుడూ అలా చేయదలచుకోలేదు. అవకాశాలు కోసం నేను బాధపడలేదు. కేవలం నాకొచ్చిన సినిమాలను మాత్రమే నేను చేశాను. బట్ నేను ఏమి చేసినా నచ్చే చేశాను. ఇప్పుడు కూడా దైర్యంగా చెప్పగలను. నా లైఫ్ ను నేను పూర్తిగా ఎంజాయ్ చేశాను’. అంటూ మల్లికా చాల విషయాలు చెప్పుకొచ్చింది.
అయితే ఇక్కడ అర్ధం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే.. బాలీవుడ్ ప్రముఖులలో ఎవరో ఒకరితోనైనా చనువుగా ఉంటూ, వారిని బాయ్ ఫ్రెండ్ గా ట్రీట్ చేయాలి, అప్పుడే ఆ బ్యూటీకి ఛాన్స్ లు వస్తాయి. లేదు అంటే.. మల్లికా షెరావత్ లాగా ఫెడ్ ఇన్ లోకి రాకముందే ఫెడ్ అవుట్ అయిపోవాల్సి వస్తోంది. ఇక ఇండస్ట్రీలోకొచ్చిన ప్రతి అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండాలని, అతడే ఆమెకు ఛాన్స్ లు వచ్చేలా ప్లాన్ చేస్తాడని పరోక్షంగా చెప్పుకొచ్చింది మల్లికా.