శ్రీశైల క్షేత ప్రధాన ఆలయానికి పరివార ఆలయాలైన పంచమఠాలలో ఒకటైన ఘంటామఠం పునరుద్ధరణ పనులు చేస్తుండగా అత్యంత పురాతన 21 తామ్ర శాసనాలు బయటపడినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఘంటామఠంలో జీర్ణోధారణ పనులు చేస్తున్న సిబ్బంది ఆలయానికి ఉత్తరం వాయువ్యం వైపు వివిధ పరిమాణాల్లోని రాగి రేకులు కనిపించాయి. వీటిని పరిశీలించి తామ్ర శాసనాలుగా నిర్ధారించుకొని అధికారులకు సమాచారం ఇచ్చారు. తామ్ర శాసనాలపై తెలుగు, నందినాగరి లిపి ఉంది. సుమారు 14 నుంచి 16 శతాబ్దం నాటివిగా భావిస్తున్నారు.