https://oktelugu.com/

టీఆర్ఎస్ లోకి ఎల్.రమణ.. చేరిక ఖాయం

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఆ పార్టీని వీడడం ఖాయంగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న గులాబీ పార్టీలో చేరనని చెప్పిన ఎల్. రమణ తాజాగా తన మనసు మార్చుకున్నాడు. ఆదివారం ఎల్. రమణ తన సొంత నియోజకవర్గం జగిత్యాల కు వచ్చారు. తనతోపాటు ఉన్న క్యాడర్ తో సమావేశమయ్యారు. పార్టీ మారుతున్నట్టుగా పరోక్షంగా హింట్ ఇచ్చేశారు. ఇటీవలే ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం సాగింది. దీనిని ఎల్. రమణ ఖండించారు. ఇలాంటి ప్రచారం చాలారోజులుగా జరుగుతోందని చెప్పారు. […]

Written By: , Updated On : June 13, 2021 / 08:14 PM IST
Follow us on

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఆ పార్టీని వీడడం ఖాయంగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న గులాబీ పార్టీలో చేరనని చెప్పిన ఎల్. రమణ తాజాగా తన మనసు మార్చుకున్నాడు. ఆదివారం ఎల్. రమణ తన సొంత నియోజకవర్గం జగిత్యాల కు వచ్చారు. తనతోపాటు ఉన్న క్యాడర్ తో సమావేశమయ్యారు. పార్టీ మారుతున్నట్టుగా పరోక్షంగా హింట్ ఇచ్చేశారు.

ఇటీవలే ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం సాగింది. దీనిని ఎల్. రమణ ఖండించారు. ఇలాంటి ప్రచారం చాలారోజులుగా జరుగుతోందని చెప్పారు. తాను వెళ్లడం లేదని తేల్చిచెప్పారు.

అయితే ఈటల రాజేందర్ స్థానంలో ఎల్ . రమణను టీఆర్ఎస్ లోకి తీసుకొని బలమైన బీసీ నేతగా మార్చి ఎమ్మెల్సీ సీటును ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది.

ఎల్. రమణ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే బలమైన నేత. పైగా పద్మశాలి సామాజికవర్గానికి చెందిన బలమైన బీసీ నేత. క్లీన్ ఇమేజ్ ఉన్న నేత కావడంతో ఈయనను టీఆర్ఎస్ లో చేర్చుకోవాలని గులాబీ దళం భావిస్తోంది.

ఈటల అటు బీజేపీలో చేరుతున్న సమయంలోనే ఎల్. రమణ టీఆర్ఎస్ లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎల్. రమణకు టీఆర్ఎస్ లో ఎలాంటి పదవులు ఇస్తారన్నది వేచిచూడాలి.