
కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రగతి భవన్ చేరుకున్నారు. ఏప్రిల్ 19న సీఎం కేసీఆర్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలుండటంతో వైద్యుల సూచన మేరకు ఆయన గజ్వేల్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్ లో ఉన్నారు. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 20 రోజుల తర్వాత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు చేరుకున్నారు.