
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అది తన వల్లే అంటాడు చంద్రబాబు. కలాంను రాష్ట్రపతిగా, వాజ్ పేయ్ ని ప్రధానిగా చేసింది తానేనంటాడు. ఆ జబ్బు పప్పు రత్నానికి అంటింది. ఇంటర్ పరీక్షల వాయిదా తనవల్లే అంటూ డప్పు కొడుతున్నాడు. కేఏ పాల్ కన్నా పెద్ద నాయకునివా లోకేశం అంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ధూళిపాళ్లకు 1400 కోట్ల సంగం డెయిరీ ఆస్తులను అప్పగించి వాటలు పంచుకున్న చంద్రబాబు, ఆయన బందిపోట్ల ముఠా అమూల్ గురించి, చెవాకులు పేలుతున్నారని అన్నారు.