
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెస్సార్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎమ్మెస్సార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ వాదిగా ఎంపీగా, మంత్రిగా ఎమ్మెస్సార్ ప్రత్యేక శైలి కనబరిచారు. రాజకీయాల్లో ఎమ్మెస్సార్ ముక్కుసూటి మనిషిగా పేరొందారు. ఎమ్మెస్సార్ మృతి పట్ల శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సంతాపం తెలిపారు.