క్రేజీ బ్యూటీ ‘రష్మిక మండన్నా’కి బాలీవుడ్ లో రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లోకి టాప్ హీరోయిన్ గా దూసుకువచ్చేసిన ఈ బ్యూటీకి, అటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు వస్తున్నాయి. రష్మిక ఇప్పటికే సిద్దార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’ చిత్రంలోనూ అలాగే అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘గుడ్ బై’ సినిమాలోనూ రష్మిక నటిస్తోంది. ‘మిషన్ మజ్ను’ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు, రెండో సినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయి కరోనా కారణంగా మధ్యలోనే ఆగిపోయింది.
అయినా రష్మికకు మాత్రం మరో బాలీవుడ్ సినిమా చేయమని ఆఫర్ వచ్చిందట. తాజాగా అభిమానులతో జరిపిన చిట్ చాట్ లో మూడో సినిమా ఒప్పుకున్నట్లు హింట్ ఇచ్చింది రష్మిక. అయితే ఆమె చేస్తోన్న మూడో సినిమాలో హీరో ఎవరు, దర్శకుడు ఎవరు లాంటి సినిమా డీటెయిల్స్ గురించి ఏమి వెల్లడించలేదు. ఇంతకీ రష్మికకు వస్తోన్న హిందీ అవకాశాలు వెనుక ఉన్న కారణం సౌత్ మార్కెట్. రష్మికను తమ సినిమాలో పెట్టుకుంటే.. సౌత్ నుండి మార్కెట్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు బాలీవుడ్ మేకర్స్.
ఈ క్రమంలో రష్మిక బాలీవుడ్ నుండి ఇలా వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇక రష్మిక ఇటు తెలుగులోనూ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. బన్నీ ‘పుష్ప’తో పాటు శర్వానంద్ సరసన ‘ఆడవారు మీకు జోహార్లు’ అనే సినిమా చేస్తోంది. ‘ఆడవారు మీకు జోహార్లు’ సినిమాలో రష్మికది కీలక పాత్ర. ఒకరకంగా ఆమె పాత్ర పైనే సినిమా నడుస్తోంది. మొత్తానికి టాలీవుడ్ లో టాప్ రేంజ్ కి వెళ్లి అటు బాలీవుడ్ లోనూ ఫుల్ క్రేజ్ ను పెంచుకుంటోంది.
అయితే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ సపోర్ట్ వల్లే రష్మికకి ఛాన్స్ లు వస్తున్నాయట. ‘మిషన్ మజ్ను’ సినిమాని ఏక్తా కపూర్ తన బ్యానర్ లోనే నిర్మిస్తోంది. రష్మికను బాలీవుడ్ కి పరిచయం చేస్తోంది కూడా ఆమె. మరి రష్మిక చేస్తోన్న ఈ మూడు సినిమాల్లో ఒక్క సినిమా సూపర్ హిట్ అయినా, రష్మికకు హిందీలో ఇంకా వరుస అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి కూరలో కరివేపాకులాంటి రోల్స్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన రష్మిక, నాలుగేళ్లల్లోనే పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్ అవ్వడం నిజంగా విశేషమే.