
చైనాకు వ్యతిరేకంగా ఏర్పడిన క్వాడ్ క్లబ్ లో బంగ్లాదేశ్ చేరడం పై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. దాంతో పాటు బంగ్లాదేశ్ ను తీవ్రంగా హెచ్చరించింది. ఈ క్వాడ్ క్లబ్ లో చేరడం వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు గణనీయమైన నష్టం సంభవిస్తుందని చైనా పేర్కొన్నది. అమెరికా నేతృత్వంలో క్వాడ్ కూటమి ఏర్పాటైంది. ఈ కూటమిలో అమెరికాతో పాటు జపాన్, ఆస్ట్రేలియా, భారత్ దేశాలు ఉన్నాయి. ఈ కూటమిని 2007 లో ప్రారంభించారు.