
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష ప్రారంభమైంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై నిన్న మంత్రుల కమిటీ సమావేశమైంది. ఆ వివరాలను సీఎం జగన్ కు మంత్రులు అందించనున్నారు. ఆక్సిజన్ సప్లై, రేమిడిసివేర్, బెడ్స్ అందుబాటు తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. మరో వైపు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజువారీగా వేలల్లోనే నమోదవుతున్నాయి.