టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య తన భర్త, పిల్లల కోసం కెరీర్ ను త్యాగం చేసి మరీ ఇంటిపట్టున హౌస్ వైఫ్ గా ఉంటూ మహేష్ వ్యవహారాలన్నీ చక్కదిద్దుకుంటోంది. ఒకప్పుడు మిస్ ఇండియా అయినా కూడా ఆమె ఇప్పుడు సంసార పక్షంగా అన్నీ తానై వ్యవహరిస్తూ మహేష్ ను ఏ లోటు రాకుండా చూసకుంటోంది. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఈ ఇల్లాలు, మహేష్ కు ఇద్దరికీ పిల్లలంటే ప్రాణం. అందుకే మహేష్, పిల్లలకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ నమ్రత సోషల్ మీడియా ఖాతాల్లో దర్శనమిస్తుంటాయి.
నమ్రత ఎప్పుడు మహేష్ తో కలిసి టూర్ కు వెళ్లినా ఎంజాయ్ చేసినా ఫొటోస్, సమాచారం అంతా సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. తాజగా నమ్రత పెట్టిన కొన్ని ఫొటోలకు లైకులే లైకులు వస్తున్నాయి.
తాజాగా పిల్లలు గౌతమ్, సితారాలు రెండు కుక్కలతో ఆడుకుంటున్న ఫొటోలను నమ్రత షేర్ చేశారు. ఈ సాయంత్రం సరదాగా గడిచిపోతోందని అందైన బయట వాతావరణంలో సేదతీరుతున్న ఫొటోలను పంచుకున్నారు. ఇక దీంతోపాటు గతంలో ఓ సినిమా షూటింగ్ కోసం మహేశ్ బాబు స్విట్జర్లాండ్ వెళ్లాల్సి వచ్చింది. పనిలో పనిగా నమ్రత గౌతమ్ కూడా మహేశ్ తో కలిసి వెళ్లారు. మహేశ్ షూటింగ్లో బిజీగా ఉండగా.. నమ్రత గౌతమ్ మాత్రం అక్కడున్న పర్వతాలను చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తీసి నమ్రత సోషల్ మీడియాలో పెట్టారు. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలన్నీ ఎప్పటికప్పుడు నమ్రతనే పిక్లను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ఫొటోలను కూడా ఆమె పెట్టింది.
నమ్రత పిల్లలపై చూపిస్తున్న కేరింగ్ వారి ఫొటోలకు ఇప్పుడు మహేష్ అభిమానుల నుంచి లైక్లు షేర్లు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఫొటోల్లో సితార, గౌతమ్ చాలా క్యూట్ గా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మహేశ్ ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా వాయిదాలు పడడంతో ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటున్నాడు.