Andhra Pradesh politics : బోర్డ్ ఆఫ్ పీస్ అంటూ ఓ కొత్త సంస్థను డొనాల్డ్ ట్రంప్ స్థాపించారు. ఇందులో 22 దేశాలు ఇందులో చేరాయి. “బోర్డ్ ఆఫ్ పీస్” అనే కొత్త అంతర్జాతీయ కూటమిని ఆయన అధికారికంగా ప్రకటించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా 19 దేశాల అగ్రనేతల సమక్షంలో ఈ సంస్థను ఆవిష్కరించడం విశేషం. ప్రస్తుతం ఈ కూటమిలో మొత్తం 22 దేశాలు సభ్యులుగా చేరాయి.
“ఇంతకంటే గొప్ప వేదిక మరోటి ఉండదు. వ్యవస్థాపక చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం నాకు గౌరవంగా, గర్వంగా ఉంది” అని ట్రంప్ ప్రకటించారు. శాంతి మండలి డాక్యుమెంట్‌పై ఆయన సంతకం చేసిన అనంతరం అక్కడే ఉన్న 19 దేశాల నాయకులు కూడా సంతకాలు చేశారు.
ప్రపంచం మొత్తం గమనిస్తున్న విషయం గాజా సంక్షోభం. ఈ నేపథ్యంలో “బోర్డ్ ఆఫ్ పీస్” అనేది గాజా సమస్యకు మాత్రమే పరిష్కారం చూపించేందుకా? లేక ప్రపంచవ్యాప్తంగా శాంతికి ప్రత్యామ్నాయ వ్యవస్థగా రూపుదిద్దుకోబోతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గాజాతో పాటు యూరప్, ఆసియా, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న వివాదాలన్నింటినీ ఒకే వేదికపై చర్చించాలన్నదే ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది.
బోర్డ్ ఆఫ్ పీస్ గాజా కోసమా లేక ప్రపంచానికి ప్రత్యామ్యాయ వ్యవస్థా ? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
