Gopichand New Movie Update: మాస్ హీరో గా గోపీచంద్(Gopichand) కి ఒకప్పుడు ఎలాంటి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయనకు ఉన్న మార్కెట్ అప్పట్లో స్టార్ హీరోలకు సమానంగా ఉండేది. అలాంటి హీరో ‘లౌక్యం’ చిత్రం తర్వాత పూర్తిగా డౌన్ అయిపోయాడు. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం, జనరేషన్ కి తగ్గట్టుగా తనని తాను మార్చుకోలేకపోవడం వల్ల మార్కెట్ పూర్తిగా పోయింది. ప్రస్తుతం గోపీచంద్ కి టాలీవుడ్ లో పట్టుమంది పది కోట్ల రూపాయిల మార్కెట్ కూడా. ఆ పది కోట్ల రూపాయిలు కూడా రీకవరీ అయ్యి బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం, అంతటి దయనీయమైన స్థితికి వచ్చేసాడు. ఆయన గత చిత్రం విశ్వం యావరేజ్ రేంజ్ లో ఆడింది. శ్రీను వైట్ల దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకు 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇకపోతే గోపీచంద్ ప్రస్తుతం తన 33వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ సినిమాని ఎట్టి పరిస్థితిలోనూ తన కెరీర్ లో ఒక మైల్ స్టోన్ లాగా మార్చుకోవాలని అనుకుంటున్నాడు. సంకల్ప్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ అయితే ఖరారు అవ్వలేదు కానీ, ఈ చిత్రం గురించి తెలిసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాన్ని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారట. భారీ స్కేల్ లో దాదాపుగా 25 రోజుల పాటు ఈ క్లైమాక్స్ సన్నివేశాన్ని రాత్రి సమయాల్లో షూట్ చేస్తారట. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఎప్పుడూ చూడని యాక్షన్ సీక్వెన్స్ లాగా ఇది ఉండబోతుంది. చూసే ఆడియన్స్ కి గూస్ బంప్స్ రావడం పక్కా అని అంటున్నారు. గోపీచంద్ మార్కెట్ ఇప్పుడు పెద్ద రేంజ్ లో లేకపోయినా నిర్మాత శ్రీనివాస చిట్టూరి రిస్క్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాకు సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నట్టు సమాచారం. సాహసం తర్వాత గోపీచంద్ కెరీర్ లో రాబోతున్న రిస్కీ ప్రాజెక్ట్ ఇది. అప్పట్లో అలాంటి సినిమాలను చూసే ఆడియన్స్ సంఖ్య చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఇలాంటి సినిమాలనే ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని ఆదరిస్తున్నారు. గోపీచంద్ ఈ చిత్రం తో భారీ లెవెల్ లో కం బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారట. ఈ టీజర్ తోనే ఈ సినిమా పై అందరికీ ఒక క్లారిటీ రానుంది.