Homeజాతీయం - అంతర్జాతీయంకేటుగాళ్లతో జాగ్రత్త.. సోనూసూద్

కేటుగాళ్లతో జాగ్రత్త.. సోనూసూద్

Sonu Sood

కరోనా కష్టకాలంలో ఎంతో మంది బాధితులకు సాయం చేస్తూ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఆపద్బాంధవుడిలా మారాడు. ఆయన సాయం పొందిన ఎంతో మంది దేవుడిలా పూజిస్తున్నారు. ఈ క్రమంలో సోనుసూద్ పేరును వాడుకుని ఆర్థిక మోసాలకు పాల్పడే కుట్రలకు తెరతీశారు. సోనూసూద్ ఫౌండేషన్ కు విరాళం ఇవ్వాలనుకుంటే ఒక రూపాయి నుంచి మొదలు మీకు తోచినంత ఇవ్వండి అంటూ ఒక డిజైన్ చేసిన ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు. ఈ విషయం సోనూసూద్ దగ్గరికి వెళ్లడంతో ఆయన స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆ నకిలీ పోస్టును షేర్ చేస్తూ వార్నింగ్ అని హెచ్చరించారు. అది ఫేక్ ఫౌండేషన్ అని, అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular