
తెలంగాణలోని జిగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి మల్లేశం అనే వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు సర్పంచ్ ఇనుగండ్ల కరుణ్ కర్ రెడ్డి పేర్కొన్నారు. మల్లేశంకు పది రోజుల క్రితం కరోనా సోకగా హోం ఐసోలేషన్ లోనే ఉండి చికిత్స తీసుకోవడంతో తగ్గిపోయిందని తెలిపారు. కరోనా తగ్గాక రెండు రోజుల నుంచి తల నొప్పి, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడుతుండగా సోమవారం కరీంనగర్ లోని ఓ దవాఖానలో పరీక్షలు చేయించుకున్నారు. మల్లేశంకు బ్లాక్ ఫంగస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారని సర్పంచ్ వివరించారు. ఈ విషయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ కు వివరించడంతో రాజేశంను అంబులెన్స్ లో హైదరాబాద్ గాంధీ దవాఖానకు పంపించినట్లు సర్పంచ్ తెలిపారు.