
తయారీ రంగంలో మొట్టమొదటి పారిశ్రామిక బీ2బీవాణిజ్య వేదికగా నిలవడం ద్వారా మోగ్లిక్స్ అతి ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నది. ఈ కంపెనీ ఇప్పుడు ఒక బిలియన్ డాలర్ల కంపెనీగా తమ తాజా 120 మిలియన్ డాలర్ల సిరీస్ ఈ ఫండింగ్ రౌండ్ తరువాత నిలిచింది. ఈ తాజా పెట్టుబడులకు ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్, హార్వార్డ్ మేనేజ్ మెంట్ కంపెనీ దీనిని నడిపించాయి. ఈ దశ ఫండింగ్ లో తమ ప్రస్తుత మదుపరులు, టైగర్ గ్లోబల్, సీక్వోయా క్యాపిటల్ ఇండియా, వెంచర్ హైవేలు సైతం పాల్గొన్నాయి.