
సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ శుక్రవారం ఉదయం ఎర్రగడ్డ చెక్ పోస్టును తనిఖీ చేశారు. లాక్ డౌన్ ఆంక్షలు, పరిస్థితులను పర్యవేక్షించారు. రోడ్లపై వచ్చిన వాహనదారులను ఆపి అనవసరంగా రోడ్ల పై తిరిగే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్ల పైకి ఎవరూ రావొద్దని, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని పోలీసులను ఆదేశించారు.