
అరేబియాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్ గా మారి తీరం వైపు దూసుకొస్తున్నదని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుఫాన్ తీర ప్రాంత రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆ ఐదు రాష్ట్రాలకు సహాయక చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం NDRF బలగాలను పంపించింది. తౌక్తా తుపాన్ ప్రభావంతో మే 16 నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ అధికారులు చెప్పారు.