
మినీ పురుపోరు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. పోలింగ్ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం కార్పొరేషన్ 20 డివిజన్ లో మంత్రి పువ్వాడ అజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఓటు వేశారు. నకిరేకల్ మున్సిపాలిటీలో మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్యే వీరేశం ఓటు హక్కు వినియోగించుకున్నారు.