
తనపై తప్పుడు కేసు పెట్టారని నిజానిజాలతో త్వరలోనే అందరి ముందుకు వస్తానని బుల్లితెర నటుడు, యాంకర్ శ్యామల భర్త లక్ష్మీనరసింహారెడ్డి తెలిపారు. మోసం కేసులో గత రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన ఆయన తాజాగా బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో సైతం తనకు, తన కుటుంబానికి అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదలు తెలుపుతూ ఓ వీడియోని విడుదల చేశారు.