
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవల దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ త్వరలోనే ఐకాన్ స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పారు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నాడని ఎక్కడా ప్రస్తావించలేదు. తాజాగా నిర్మాత బన్నీ వాసు ఓ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పుష్ప తొలి పార్ట్ చేస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా పూర్తి కాగానే శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత మురుగదాస్ సినిమా, బోయపాటి సినిమాలుంటాయని తెలిపారు.