https://oktelugu.com/

పార్టీలో చేరినా పదవులు రావా?

గత ఎన్నికల్లో టీడీపీ పరాభవం తరువాత నేతలు వైసీపీలోకి మారిపోయారు. వారిలో సీనియర్లు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరందరి రాకతో టీడీపీ బలహీనపడినా వైసీపీకి ఒరిగిందేమీ లేదు. వైసీపీలో చేరిన వారంతా అలా కండువాలు కప్పుకుని సైడయిపోయి తమ పనులు తామే చేసుకుంటున్నారు. ఇపుడు వారి అడ్రస్ అనుచరులకైనా తెలుస్తుందా అన్నదే అనుమానం. దీంతో కొత్తగా చేరిన వారితో అటు అధికార పార్టీకి, ఇటు ప్రతిపక్ష పార్టీకి ఎలాంటి లాభం లేకుండా పోతోంది. మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 11, 2021 / 10:07 AM IST
    Follow us on

    గత ఎన్నికల్లో టీడీపీ పరాభవం తరువాత నేతలు వైసీపీలోకి మారిపోయారు. వారిలో సీనియర్లు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరందరి రాకతో టీడీపీ బలహీనపడినా వైసీపీకి ఒరిగిందేమీ లేదు. వైసీపీలో చేరిన వారంతా అలా కండువాలు కప్పుకుని సైడయిపోయి తమ పనులు తామే చేసుకుంటున్నారు. ఇపుడు వారి అడ్రస్ అనుచరులకైనా తెలుస్తుందా అన్నదే అనుమానం. దీంతో కొత్తగా చేరిన వారితో అటు అధికార పార్టీకి, ఇటు ప్రతిపక్ష పార్టీకి ఎలాంటి లాభం లేకుండా పోతోంది.

    మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్ బాబు, రహమాన్,తప్పల గురుమూర్తిరెడ్డి వంటి వారు టీడీపీలో బాగా ప్రాచుర్యం పొందారు. వీరంతా కీలకనేతలు. వైసీపీలో చేరాక వారి పేర్లువాే మరిచిపోయే స్థితికి చేరుకున్నారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కూడా వైసీపీలో చేరి తన ప్రతాపాన్ని తగ్గించుకున్నారు. విశాఖకార్పొేషన్ ఎన్నికల్లో గవర సామాజిక వర్గానికి చెందిన కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరారు. రాష్ర్ట మహిళా అధ్యక్షురాలు రమణి కుమారి సైతం పార్టీ మారారు.

    వైసీపీలో చేరిన వారందరు చప్పుడు చేయకపోవడానికి కారణం వారికి పదవులు ఇవ్వకపోవడమే. సాధారణంగా పార్టీ పనులతోపాటు సొంత పనులు చేసుకోవాలని పార్టీలు మారుతుంటారు. కానీ ఇక్కడ పార్టీ మారినా పరిస్థితిలో మార్పు లేదని నిట్టూరుస్తున్నారు. కొత్తగా చేరిన వారికి పదవులు ఇస్తే పాత వారి సంగతేంటని మిగతా వారు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా వైసీపీలో చేరిన వారందరూ నిస్తేజంలో మునిగిపోయారు.

    తీరా ఆలోచిస్తే పార్టీ మారినా తమకు ఒరిగిందేమీ లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరు తమ పార్టీలో చేరితే ఆహ్వానిస్తామని చెబుతున్నా పదవులు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో పార్టీ కోసం పదేళ్లు పని చేసిన వారిని కాదని కొత్త వారికి ఎలా ఇస్తామని బహిరంగంగానే పేర్కొంటున్నారు. దీంతో కొత్తవారు చేసేది లేక గమ్మునుండిపోతున్నారు. పార్టీ కోసం నిజాయతీగా కష్టపడిన వారికి పదవులు కచ్చితంగా వస్తాయని చెబుతున్నారు.