తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సుల బోధనకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ మేరకు తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఒడియా భాషల్లో బీటెక్ కోర్సుల బోధనకు ఏఐసీటీఈ ఆమోదించింది. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనకు ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ నిబద్ధతతో ఉన్నారని మంత్రి ప్రధాన్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం పై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు.