Amritsar: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో మంగళవారం ఉదయం పేలుడు సంభవించినట్లు సమాచారం. నగరంలోని మజితా రోడ్ బైపాస్‌లోని డీసెంట్ అవెన్యూ వెలుపల జరిగిన పేలుడులో ఒక వ్యక్తి గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. పేలుడుకు గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన తర్వాత ఆ ప్రాంతం లోని ప్రజలు భయాందోళనలకు గురైయ్యారు.