https://oktelugu.com/

మెదడులో క్రికెట్ బంతి సైజులో బ్లాక్ ఫంగస్

ఓ వ్యక్తి మెదడులో క్రికెట్ బంతి సైజులో బ్లాక్ ఫంగస్ ను పాట్నాలోని ఇందిరా గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. 60 ఏళ్ల ఆ పేషెంట్ కు మూడు గంటలు సర్జరీ నిర్వహించి ఫంగస్ ను తొలగించడం విశేషం. అనిల్ కుమార్ అనే ఆ పేషెంట్ ఈ మధ్యే కొవిడ్ నుంచి కోలుకున్నాడు. అయితే తరచూ మైకంగా ఉండటం, స్పృహ తప్పడం జరుగుతుండేది. దీంతో అతడిని ఐజీఐఎంఎస్ కు రిఫర్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 13, 2021 / 10:59 AM IST
    Follow us on

    ఓ వ్యక్తి మెదడులో క్రికెట్ బంతి సైజులో బ్లాక్ ఫంగస్ ను పాట్నాలోని ఇందిరా గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. 60 ఏళ్ల ఆ పేషెంట్ కు మూడు గంటలు సర్జరీ నిర్వహించి ఫంగస్ ను తొలగించడం విశేషం. అనిల్ కుమార్ అనే ఆ పేషెంట్ ఈ మధ్యే కొవిడ్ నుంచి కోలుకున్నాడు. అయితే తరచూ మైకంగా ఉండటం, స్పృహ తప్పడం జరుగుతుండేది. దీంతో అతడిని ఐజీఐఎంఎస్ కు రిఫర్ చేశారు. అక్కడ అతనికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు గుర్తించారు. సర్జరీ తర్వాత అతని ఆరోగ్యం నిలకడగా ఉంది.