సొంత బలాన్ని వీడి పరులపై ఆధారపడుతున్న టీడీపీ

తెలుగుదేశం పార్టీ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎంతో చరిత్ర కలిగిన పార్టీ ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతోంది. పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. సీనియర్ నాయకులు ఉన్నారు. కానీ ఇటీవల పార్టీ అధినాయకత్వం కొత్త పోకడలు పోతోంది. పార్టీలోని వారికంటే ఇతరులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. మత్తు డాక్టర్ సుధాకర్, ఎంపీ రఘురామ కృష్ణం రాజు విషయంలో టీడీపీ చేస్తున్న రాజకీయ విన్యాసాలతో సొంత పార్టీలో విమర్శలు వస్తున్నాయి. టీడీపీ అంటే […]

Written By: Srinivas, Updated On : June 13, 2021 11:21 am
Follow us on

తెలుగుదేశం పార్టీ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎంతో చరిత్ర కలిగిన పార్టీ ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతోంది. పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. సీనియర్ నాయకులు ఉన్నారు. కానీ ఇటీవల పార్టీ అధినాయకత్వం కొత్త పోకడలు పోతోంది. పార్టీలోని వారికంటే ఇతరులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.

మత్తు డాక్టర్ సుధాకర్, ఎంపీ రఘురామ కృష్ణం రాజు విషయంలో టీడీపీ చేస్తున్న రాజకీయ విన్యాసాలతో సొంత పార్టీలో విమర్శలు వస్తున్నాయి. టీడీపీ అంటే ప్రాణమిచ్చే కార్యకర్తలు ఎందరో ఉన్నారు. ఈ మధ్య కరోనా కాటుకు చాలామంది బలైపోయారు. టీడీపీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ కూడా కరోనాతో చనిపోయారు.

ఇటీవల నారా లోకేష్ విశాఖ పర్యటనలో భాగంగా మత్తు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించి వెళ్లిపోయారు. కార్యకర్తల కుటుంబాలను కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో టీడీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. కార్యకర్తలను కాదని బయటి వ్యక్తులను పరామర్శించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో చంద్రబాబు అతి చేస్తున్నారు. ఆయన పక్షాన నిలిచి కేంద్ర హోం శాఖకు లేఖలు రాస్తున్నారు. అనుకూల మీడియా ద్వాా అండగా నిలిచారు.

జగన్ ను ఎలా ఇబ్బంది పెట్టాలన్న దాని మీదే దృష్టి పెట్టి బయట వారికే టీడీపీ శక్తియుక్తుల్ని ధారపోస్తున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తల్లో మనోనిబ్బరం పోతోంది. కేడర్ లో ఆత్మస్థైర్యం పెంపొందించేలా చర్యలు తీసుకోకపోతే టీడీపీ పని అయిపోతుందని భావిస్తున్నారు. సొంత పార్టీ వారిని కాదని బయట వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో కార్యకర్తలు కినుక వహిస్తున్నారు. టీడీపీ నాయకులను ఆదుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు.