Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్Revanth Reddy: తెలంగాణలో బీజేపీ రెండుగా చీలిపోయింది.. రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణలో బీజేపీ రెండుగా చీలిపోయింది.. రేవంత్ రెడ్డి

తెలంగాణ లో బీజేపీ రెండుగా చీలి పోయిందని టీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ అనుకుల వర్గం, వ్యతిరేక వర్గంగా బీజేపీ చీలిపోయిందన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతామని పదే పదే చెబుతున్న బండి సంజయ్ కేసీఆర్ అవినీతి చిట్టాను నిన్న హో మంత్రి అమిషాకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ లో సీఎం కేసీఆర్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, మూడెకరాలు, డబుల్ బెడ్రూమ్ లు ఇవ్వలేదని, కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన అసైన్డ్ భూములను 3 లక్షల ఎకరాలు లాక్కున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత దళిత, గిరిజన లకు జరుగుతున్న అన్యాయం పై పోరాటాలు చేశాం. దళిత బస్తీలు , ఆదివాసీ గూడెలకు వెళ్లాం. రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన వాటాపై ఇంద్రవెల్లి నుంచి దండుకట్టాం. నిన్న గజ్వేల్ గడ్డ మీద తెలంగాణ ప్రజలు కదంతొక్కారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలు విజయవంతం అయ్యాయని అన్నారు.  కాంగ్రెస్ శ్రేణులు అద్బుతమైన పోరాటం చేసి విజయవంతం చేశారు. మాకు సంపూర్ణ విశ్వాసం కలిగింది.. కేసీఆర్ ఇక శాశ్వతంగా ఫాంహౌస్ కు పరిమితం అవుతుందని అనిపించిందని తెలిపారు.

సెప్టెంబర్ 17ను అడ్డం పెట్టుకుని రెండు మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ గోతికాడ నక్కలా ఎదురు చూస్తోంది. తెలంగాణ లో జరుగుతున్న అవినీతి పై కేసీఆర్ కుటుంబం మీద విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా కు ఆధారాలతో ఫిర్యాదు చేద్దామని అపాయింట్ మెంట్ కోరిన.. సమయం ఇవ్వలేదు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షాకు బండి సంజయ్, అరవింద్ ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. కేంద్రం లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాంజీగోండు గుర్తుకురాలేదా.. బీజేపీ తప్పుడు చరిత్రను మాట్లాడుతోంది. రాంజీగోండు, కాశిం రిజ్వికి మధ్య వంద సంవత్సరాల తేడా ఉంది. అమిత్ షా పర్యటన సందర్భంగా బీజేపీ ఇచ్చిన ప్రకటనలో గోండు బిడ్డ సోయం బాబురావు ఫోటో పెట్టలేదు. తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా ను అపాయింట్ మెంట్ కోరితే.. అవకాశం ఇవ్వాలె. మై హోమ్ రామేశ్వర్ రావు, రాజ్ పుష్పా సంస్థలకు తెలంగాణ భూములు అడ్డంగా కట్టబెట్టారు కేసీఆర్ అని అన్నారు.  దానిపై ఇప్పటికే సిబిఐ డైరెక్టర్ కు కోకాపేట భూములపై ఫిర్యాదు చేశాం. అదే హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ను ఆహ్వానం పేరుతో.. ఈనెల 16న ఢిల్లీ లో చిన్న జీయర్ స్వామి, మై హోమ్ రామేశ్వర్ రావు కలిశారు. కేసీఆర్ తరుపున లాబీయింగ్ చేసింది వీరే అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

కిషన్ రెడ్డి సమక్షంలో జరిగిన ఒప్పందం ఏంటీ. భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసందమైనది అంబికా దర్బార్ బత్తిలాగా బాద్ షా కు అమిత్ షా కు మధ్య కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుసంధానం చేశారు. కాంగ్రెస్ నేతలకు అపాయింట్ మెంట్ ఇవ్వొద్దని కోరారు. బీజేపీ లో రెండు వర్గాలు వున్నాయ్. అందులో ఒకటి కేసీఆర్ వర్గం మరొక్కటి వ్యతిరేక వర్గం. కేసీఆర్ అవినీతి చిట్టా నిన్న అమిత్ షా కు బండి సంజయ్ ఎందుకు ఇవ్వలేదని అన్నారు.   డ్రగ్స్ తో తనకేమీ సంబంధం అని కేటీఆర్ అంటున్నడు.. ఈడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదు. కోర్టు లో ఎక్సైజ్ శాఖ అఫిడవిట్ వేసింది.. కేసు మూసేయమని .. ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ఈడీ ఈ రోజు రానా , రకుల్ ప్రీత్ సింగ్ ను పిలించింది.. ఆరోజు ఎక్సైజ్ శాఖ ఎందుకు విచారణ చేయలేదు. ఎక్సైజ్ విచారణను అడ్డుకున్నది ఎవరు రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. డ్రగ్స్ విషయంలో కేంద్ర సంస్థలకు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు.

 

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version