Love Story Movie: అలనాటి చిత్రం ప్రేమ నగర్ (1971) లో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా నటించారు. కోడూరి కౌసల్యాదేవి గారి నవల “ప్రేమ నగర్” ఆధారంగా చేసుకుని రూపొందించబడిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. 750 రోజులు పైగా ఆడిన ఈ చిత్రం దసరా బుల్లోడు తరువాత సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాగా నిలిచింది. అంతే కాకుండా ప్రేమ నగర్ చిత్రం తమిళంలో “వసంత మాలిగై” (1972) హిందీలో ప్రేమ్ నగర్ (1974) గా రూపొందించబడ్డాయి. రామానాయుడు బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు K.S. ప్రకాష్ రావు గారు దర్శకత్వం వహించారు.
ప్రేమ నగర్ అనగానే గుర్తొచ్చేది ” ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం” అనే పాట. దాదాపుగా 11 పాటలు ఉన్న ఈ చిత్రంలో ప్రతి పాట ఒక ఆణిముత్యం. ఒక్కో పాట ఒక్కో ఎమోషన్ ని కలిగి ఉంటుంది. అన్ని రకాల వర్గాలను మెప్పించిన ఈ చిత్రం సినీ ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకే ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.
తాత దారి పట్టిన మనవడు: అలనాటి అధ్భుత ప్రేమ కావ్యం “ప్రేమ నగర్” సెప్టెంబరు 24న రిలీజ్ అయ్యింది. ఇపుడు నాగ చైతన్య, సాయి పల్లవి “లవ్ స్టోరీ” సినిమా కూడా సెప్టెంబరు 24 న రిలీజ్ కానున్నది. మొత్తానికి తాత బాటను అనుసరిస్తూ పెద్ద విజయాన్ని రాబట్టుకోవాలని భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు చైతూ.
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం “లవ్ స్టోరి” సెప్టెంబర్ 24 న విడుదల కానున్నది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. గోదావరి, ఆనంద్, ఫిదా లాంటి ప్రేమ కావ్యాలతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాడు ఈ “లవ్ స్టోరి” డైరెక్టర్.
ఇప్పటికే విడుదల అయిన పాటలు, సినిమా పోస్టర్, టీజర్ ప్రేక్షకుల్లో పెద్ద హైప్ నే క్రియేట్ చేశాయి. ఇంక నాగార్జున కూడా తన తరుపున “ఆల్ ది బెస్ట్ చెయ్’ అంటూ ట్విట్టర్ వేదికగా విషెస్ తెలిపాడు. మరి ప్రేక్షకుల అంచనాలను చెయ్ రీచ్ అవుతాడో లేదో చూడాలంటే సెప్టెంబరు 24 న వరకు ఎదురు చూడాల్సిందే.
#LoveStory Looking good ra chay!!
All the best!! https://t.co/a2Ud4a2lQc pic.twitter.com/dBjVZLcdHM— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 13, 2021