
Hanuman Trailer: అందరూ నడిచే దారిలో నడిస్తే ఏముంటుంది కిక్కు. కాస్త డిఫెరెంట్ దారిని ఎంచుకోవాలి. అప్పుడే సరైన విజయాలు దక్కుతాయి. ఆ కోవలోనే సరికొత్త కథలతో మన ముందుకు వస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashanth Varma). తన మొదటి చిత్రమే ‘అ’ అంటూ సరికొత్త విలక్షణ కథతో మన ముందుకు వచ్చాడు. హీరో నాని నిర్మించిన ఈ మూవీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. డిఫెరెంట్ కాన్సెప్ట్ అదిరిందని అన్నారంతా..
ఇక ఆ తర్వాత ‘కల్కి’; జాంబిరెడ్డి చిత్రాలతో ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో విలక్షణ చిత్రాల దర్శకుడిగా తన మార్క్ చూపించాడు. పైన మూడు సినిమాలు మూడు విభిన్న కథలు.. మూడు సెటప్పులు. ఒక కథకు.. మరో కథకు అస్సలు సంబంధం లేకుండా తీశాడు. ఇప్పుడు నాలుగోసారి మరో భారీ ప్రయత్నం చేస్తున్నాడు. ఏకంగా ప్యాన్ ఇండియా మూవీకి వెళ్లాడు.
బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి ‘జాంబిరెడ్డి’తో హీరో అయిన నటుడు తేజ సజ్జును పెట్టి ప్రశాంత్ వర్మ ఏకంగా ‘హనుమాన్’ అంటూ ప్యాన్ ఇండియా మూవీని ప్లాన్ చేశారు. హనుమంతుగా తేజ పాత్రను పరిచయం చేస్తూ తాజాగా వదిలిన టీజర్ ఆకట్టుకుంటోంది.
హనుమాన్ అనే చిత్రం పోస్టర్ తోపాటు టీజర్ విడుదల కాగానే ఇది సోషియో ఫాంటసీ చిత్రమా? పురాణ గాథ అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే తాజా టీజర్ లో అద్భుతాన్ని ఆవిష్కరించాడు ప్రశాంత్ వర్మ.
హీరో తేజ హనుమంతుడిలా గాల్లో విన్యాసాలు చేస్తూ జింకను వేటాడుతూ పాత్రను అడవుల్లో అందమైన లోకేషన్లలో పరిచేయం చేసిన టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే కథ అని ఇది తెలుస్తోంది.
భారతీయ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా తీస్తున్న ఈ మూవీని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు స్టార్ హీరోలకే ప్యాన్ ఇండియా సాధ్యం కానీ ఈరోజుల్లో కుర్ర హీరో తేజ సజ్జును పెట్టుకొని ఏకంగా జాతీయ స్థాయి సినిమా తీస్తున్న ప్రశాంత్ వర్మ ధైర్యాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే..
