
ప్రపంచ కుబేరుడు, మైక్రోసాప్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్ సంచలన ప్రకటన చేశారు. బిల్ గేట్స్ దంపతులు విడిపోతున్నారు. 27 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నారు. తాము విడిపోతున్నట్లుగా బిల్ గేట్స్ ట్వీట్ చేశారు. మెలిందాతో తన వివాహ బంధానికి ఇక ఫుల్ స్టాప్ పెడుతున్నట్లుగా చెప్పారు. 27 ఏళ్ల తమ వివాహ బంధానికి ముగింపు పలకాలని ఇరువురు కలిసి నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.