
నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం పొంగురు కండ్రిక సమీపంలో నెల్లూరు- ముంబై రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని మారుతి ఓమ్ని కారు ఢీకొ్టింది. అనంతరం ఓమ్ని కారు వెనుకున్న మరో కారును వేరొక లారీ ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.