https://oktelugu.com/

Bangarraju: బంగార్రాజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగ చైతన్య

నాగార్జున లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం బంగార్రాజు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన హిట్ చిత్రం సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్ గా బంగార్రాజు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. నాగ్ కి జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్యకి జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. జీ స్టూడియోస్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం పై నాగార్జున నిర్మిస్తున్నారు. బంగార్రాజు చిత్ర ఫస్ట్ లుక్ కొద్ది సేపటి క్రితం చైతన్య […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 29, 2021 / 01:09 PM IST
    Follow us on

    నాగార్జున లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం బంగార్రాజు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన హిట్ చిత్రం సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్ గా బంగార్రాజు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. నాగ్ కి జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్యకి జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. జీ స్టూడియోస్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం పై నాగార్జున నిర్మిస్తున్నారు. బంగార్రాజు చిత్ర ఫస్ట్ లుక్ కొద్ది సేపటి క్రితం చైతన్య విడుదల చేశారు. ఇందులో నాగార్జున మాత్రమే కనిపిస్తున్నారు. స్వరగం నుంచి దిగుతున్నట్లు గా ఆయన కనిపిస్తున్నారు.