YS Vijayamma: వైఎస్ ఆర్ కేబినెట్ తో విజయమ్మ భేటీ కథేంటి?

వైఎస్ విజయలక్ష్మి తన కూతురు షర్మిల కోసం మరోమారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కేబినెట్ లో పనిచేసిన వారిని ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్ వర్థంతి సందర్భంగా అందరితో భేటీ నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పటికే అందరికి పిలుపులు అందుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నేలందరిని లోటస్ పాండ్ కు రావాల్సిందిగా కోరుతున్నారు. దీంతో తెలుగు ప్రాంతాల వారందరితో సమావేశం ఉంటుందని తెలుస్తోంది. ఆహ్వానాలు అందుకున్న వారిలో కేవీపీ […]

Written By: Srinivas, Updated On : August 29, 2021 1:02 pm
Follow us on

వైఎస్ విజయలక్ష్మి తన కూతురు షర్మిల కోసం మరోమారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కేబినెట్ లో పనిచేసిన వారిని ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్ వర్థంతి సందర్భంగా అందరితో భేటీ నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పటికే అందరికి పిలుపులు అందుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నేలందరిని లోటస్ పాండ్ కు రావాల్సిందిగా కోరుతున్నారు. దీంతో తెలుగు ప్రాంతాల వారందరితో సమావేశం ఉంటుందని తెలుస్తోంది.

ఆహ్వానాలు అందుకున్న వారిలో కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, డీఎస్, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి వంటి నేతలున్నారు. విజయమ్మ స్వయంగా వారందరికి ఫోన్ చేసి రావాల్సిందిగా కోరుతున్నారు. ఇది రాజకీయ సమావేశం కాదని చెప్పడంతో అందరు హాజరు అవుతారని తెలుస్తోంది. వైఎస్ చనిపోయాక పన్నెండేళ్లుగా పెట్టని సమావేశం ఇప్పుడు ఎందుకు పెట్టారని అందరిలో సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయమ్మ షర్మిల పార్టీ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా పాల్టొంటున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే ఈ భేటీలో అందరిని పార్టీలోకి రావాలని ఆహ్వానించే అవకాశాలు లేకపోలేదు.

ఈ నేపథ్యంలో విజయలక్ష్మి ఆత్మీయ సమావేశం వెనుక ఉద్దేశాలు ఏమై ఉంటాయని అందరిలో అనుమానాలు వస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు ప్రాంతాల నుంచి వచ్చే నేతలకు షర్మిల పార్టీ గురించి చెబుతారని సమాచారం. ప్రస్తుతం షర్మిల పార్టీలో నేతలు కనిపించడం లేదు. ఫలితంగా తెలంగాణలో ఆమె పార్టీ ప్రస్థానం డోలాయమానంలో పడిపోతుందనే ఆలోచనతోనే విజయమ్మ చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది.

అయితే సమావేశ ఎజెండా ఏమిటన్నదానిపై ఇంకా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆహ్వానాల్లో అందరికి ప్రాధాన్యత ఇచ్చారు. రెండు ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో నేతలు వస్తారని అనుకుంటున్నా ఇందులో రాజకీయ ఎజెండా ఏమిటన్న దానిపై క్లారిటీ లేదు. షర్మి పార్టీని బలోపేతం చేసే క్రమంలో మరింత వేగం పుంజుకునేలా విజయమ్మ చొరవ చూపుతుందని తెలుస్తోంది.

వైఎస్ షర్మిల పార్టీ పెట్టి రెండు మూడు నెలలు అవుతున్నా పార్టీలో చలనం లేదు. నాయకులు రావడం లేదు. చేరికలు మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో షర్మిల రాజకీయంగా ఎదిగే క్రమంలో ఉన్న లోటుపాట్లను సరిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే నేతలను పార్టీలోకి రప్పించేందకు విజయమ్మ ప్రత్యేక చొరవ చూపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.