WTC Final 2025: సౌతాఫ్రికాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కంగారూలకు సఫారీలు వరు షాక్ లు ఇస్తున్నారు. మ్యాచ్ మొదలైన కాసేపటికే కగిసో రబాడ ఓకే ఓవర్ లో ఉస్మాన్ ఖవాజా , కామెరూన్ గ్రీన్, లను ఔట్ చేశాడు. తరువాత మార్నస్ లబుషేన్ 17 పరుగులు, ట్రావిస్ హెడ్ 11 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యారు. దీంతో లంచ్ సమయానికి ఆసీస్ 67 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.