Ashish Vidyarthi: విలక్షణమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటులు ప్రేక్షకుల్లో ప్రత్యేకంగా నిలుస్తారు. సౌత్ ఇండస్ట్రీలో విలనిజం మాత్రమే కాకుండా కామెడీ, యాక్షన్ పాత్రలో నటించిన మెప్పించిన వారిలో ఆశిష్ విద్యార్థి ఒకరు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీ, బెంగాళీ సినిమాల్లో తన ప్రతిభ చూపిన ఆయన కొంత కాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తనకు అవకాశాలు కల్పించాలని కోరిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఈ వీడియోపై పలు రకాల కామెంట్లు వచ్చాయి. ఆ తరువాత ఆశిష్ విద్యార్థి మరోసారి ప్పందించారు. ఈసారి ఏమన్నారంటే?
తెలుగులో ‘పాపే నా ప్రాణం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు ఆశిష్ విద్యార్థి. ఆ తరువాత ఆయన పలు సినిమాల్లో నటించినా గుర్తింపు రాలేదు. అయితే మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ సినిమాలో తన విలనిజంతో మెప్పించారు. అప్పటి నుంచి ఆశిష్ కు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత ఈయన చిరుత, తులసి, లక్ష్యం, కంత్రి, ఒంటరి, వరుడు, అదుర్స్, భాయ్, గ్రీక్ వీరుడు వంటి సినిమాల్లోకనిపించారు. అయితే కేవలం విలన్ పాత్రలు మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఓరియంటెడ్ లోనూ మెప్పించారు. గుడుంబా శంకర్ లాంటి సినిమాలో కామెడీ విలన్ తో ఆకట్టుకున్నారు.
52 ఏళ్ల వయసు ఉన్న ఆశిష్ విద్యార్థి తనకంటే 15 సంవత్సరాలు తక్కువ వయసు ఉన్న అమ్మాయిని కొన్ని నెలల కింద పెళ్లి చేసుకున్నారు. ఈ సమయంలో తనపై విమర్శలు వచ్చినా.. ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని చెప్పారు. అయితే ఆ తరువాత ఆశిష్ విద్యార్థికి సినిమాల్లో అవకాశాలు రాలేదు. దీంతో జీవన గమనం కష్టంగా మారింది. దీంతో ఓ ఇంటర్వ్యూలో ‘నేను చనిపోలేదు.. నాకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వండి’ అంటూ కామెంట్ చేశారు.
ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కొందరు సినిమాల్లో అవకాశాల కోసం అడుక్కోవడం ఏంటి? అని కొందరు కామెంట్స్ చేశారు. అయితే దీనిపై ఆశిష్ విద్యార్థి స్పందించారు. సినిమాలంటే తనకు ఇష్టమని, ఇప్పటి వరకు ఎన్నో పాత్రలు చేశానని అన్నారు. అయితే కేవలం విలన్ మాత్రమే కాకుండా ఇతర పాత్రల్లో కూడా నటించగలనని చెప్పారు. అందువల్లే అలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చిందని ఆశిష్ విద్యార్థి చెప్పారు. ఏదీ ఏమైనా ఆశిష్ విద్యార్థి కామెంట్స్ సంచలనంగా మారాయి.