SRH vs MI, IPL 2024: ప్రస్తుతం క్రికెట్ అభిమానులందరిలో ఐపీఎల్ గురించే చర్చ జరుగుతుంది. ఇక ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్ లు స్టార్ట్ అయి అన్ని జట్లు కూడా ఒకటి రెండు మ్యాచ్ లను ఆడుతున్న నేపథ్యంలో ప్రతి వ్యక్తి తమ తమ అభిమాన టీమ్ లో ఉన్న ప్లేయర్లను చూడడానికి ఆయా మ్యాచ్ లకు సంబంధించిన టిక్కెట్లను కొనుగోలు చేసే ప్రక్రియలో బిజీగా ఉన్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై టీమ్ ల మధ్య ఒక మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ లో ధోని ని చూడడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ మ్యాచ్ కి సంబంధించిన టికెట్లను సోమవారం రోజున ఆన్ లైన్ లో పెట్టారు. ఇక అవి ఆన్ లైన్ లో పెట్టిన కొద్ది గంటల్లోనే టికెట్లు మొత్తం అమ్ముడు పోయినట్టుగా చూపించారు.
ఇక 40 వేల కెపాసిటీ ఉన్న ఉప్పల్ స్టేడియం లో కేవలం 20,000 టికెట్లను మాత్రమే ఆన్ లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే 2019 కరోనా తరువాత ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు పెద్దగా జరిగింది లేదు. ఒకవేళ జరిగిన అవి నామ మాత్రపు మ్యాచులు గానే నిర్వహించారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు అయితే ధోని ఒకసారి కూడా ఉప్పల్ స్టేడియంలో ఆడలేదు. ఇక ఇది ధోనీకి చివరి సీజన్ కావడంతో ఆయన బ్యాటింగ్ చూడ్డానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
అలాగే ఈసారి మిస్ అయితే ధోనిని మనం బ్యాట్ పట్టుకొని చూడలేము అనే కాన్సెప్ట్ తో కూడా చాలామంది ఈ మ్యాచ్ ను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 20 వేల టికెట్లను మాత్రమే అమ్ముకొని, మిగతా 20 వేల టికెట్లను బ్లాక్ లో అమ్మే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 750, 2500 లా రూపాయల కలిగిన టికెట్లు అమ్ముడుపోయినట్టుగా చూపిస్తున్నారు. అలాగే 20,000 రూపాయల ధర కలిగిన టిక్కెట్లు మాత్రమే అవలెబుల్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అంత డబ్బులు పెట్టి సామాన్యులు ఆ మ్యాచ్ ను చూడలేరు. కాబట్టి వీటిని సెలబ్రిటీలకు చాలా ఎక్కువ ధరలో బ్లాక్ లో అమ్మే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే కాంప్లిమెంటరీ పాసుల కింద బ్లాక్లో అమ్మబోతున్నట్టుగా అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఉప్పల్ వేదికగా ఎప్పుడు మ్యాచ్ లు జరిగిన క్లబ్బుల కార్యదర్శులతో పాటు, నేషనల్ ఇంటర్నేషనల్ క్రికెటర్లకి కాంప్లిమెంటరీ పాసులు ఇస్తారు…ఇక ఈ మ్యాచ్ విషయంలో ఎంట్రీ పాసులకు హెచ్ సిఏ పెద్దలు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. 20000 టికెట్లను 5 నుంచి 6 లక్షల రూపాయల వరకు బ్లాక్ లో అమ్మ్బోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఉప్పల్లో మ్యాచ్ అంటే ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టుగా టికెట్లని బ్లాక్ లో అమ్ముతూ విపరీతమైన డబ్బులని కూడా సంపాదిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక రీసెంట్ గా హైద్రాబాద్ పోలీసులు బ్లాక్ లో టిక్కెట్లు అమ్మే కొంతమందిని పట్టుకున్నట్టుగా కూడా న్యూస్ అయితే వచ్చింది…