Ram Charan: హీరో రామ్ చరణ్ జన్మదినం నేడు. ఆయన 39వ ఏట అడుగుపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ్ చరణ్ అభిమానులు వేడుకలు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికర సంగతులు వెలుగులోకి వస్తున్నాయి. రామ్ చరణ్ హీరో కాక ముందు ఓ జాబ్ చేశాడట. ఈ విషయాన్ని ఆయన గతంలో వెల్లడించారు. రామ్ చరణ్ నటుడు కావాలని ముంబైలో శిక్షణ తీసుకున్నారు. ముంబై స్కూల్ యాక్టింగ్ లో ట్రైన్ అయ్యారు. అదే స్కూల్ లో శ్రీయ శరన్ కూడా శిక్షణ తీసుకుందట.
వీరిద్దరి త్రో బ్యాక్ ఫోటో ఒకటి గతంలో వైరల్ అయ్యింది. ఇక 2007లో చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. అప్పట్లో ఫుల్ ఫార్మ్ లో ఉన్న పూరి జగన్నాధ్ కి రామ్ చరణ్ ని లాంచ్ చేసే బాధ్యత అప్పగించారు చిరంజీవి. చిరుత టైటిల్ తో విడుదలైన రామ్ చరణ్ డెబ్యూ మూవీ ఆదరణ దక్కించుకుంది. రామ్ చరణ్ మేనరిజం, డాన్సులు జనాలకు నచ్చాయి.
కొన్ని విమర్శలు కూడా వినిపించాయి. లుక్స్ పరంగా చిరంజీవి అంత అందంగా లేడంటూ ఎద్దేవా చేశారు. ఆ విమర్శలకు రామ్ చరణ్ తన విజయాలతో సమాధానం చెప్పాడు. చిరుత సూపర్ హిట్ కాగా… రెండో చిత్రం రాజమౌళి దర్శకత్వంలో చేసే అవకాశం వచ్చింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మగధీర భారీగా తెరకెక్కించారు. 2009లో విడుదలైన ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్. గత రికార్డ్స్ మొత్తం తిరగరాసింది. అక్కడి నుండి రామ్ చరణ్ తిరిగి వెనక్కి చూసుకోలేదు.
ఇక రామ్ చరణ్ హీరో కాకముందు చేసిన జాబ్ విషయానికి వస్తే… ఆయన తన ఇంట్లోనే ఒక జాబ్ చేశాడట. ఆ పని ఏమిటీ అనేది రామ్ చరణ్ స్పష్టంగా చెప్పలేదు. అందుకు తనకు ఎలాంటి శాలరీ ఇవ్వలేదని రామ్ చరణ్ అన్నాడు. అదన్నమాట సంగతి. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చేస్తున్నాడు. ఇది చిత్రీకరణ జరుపుకుంటుంది. నేడు ఒక సాంగ్ విడుదల చేశారు. నెక్స్ట్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక చిత్రం, సుకుమార్ దర్శకత్వంలో మరొక చిత్రం రామ్ చరణ్ ప్రకటించారు.