Arjun Das Meets Pawan: పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఓజీ. గ్యాంగ్ స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ గా ఇది సిద్ధమవుతోంది. కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. చిత్రీకరణలో భాగంగా పవన్ కల్యాన్ తో దిగిన ఫొటోలను అర్జున్ దాస్ అభిమానులతో పంచుకున్నారు. పవన్ తో మరో సినిమా కోసం వర్క్ చేయాలని ఉందని చెప్పారు. పవన్ కల్యాన్ గారు.. మిమ్మల్ని నాకెంతో సంతోషంగా ఉంది. మీతో కలిసి వర్క్ చేసిన ప్రతి రోజునూ నేను గుర్తు పెట్టుకుంటా… మనం కలిసి షూట్ లో పాల్గొన్నప్పుడు నాకోసం సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు.