Salaar 2 movie release date : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas)…ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మంచి సక్సెస్ లను సాధించి ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టెలా ఉండడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన సలార్, కల్కి లాంటి రెండు సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధించాడు. ఇక ఇప్పుడు రాజాసాబ్ (Rajasaab), ఫౌజీ (Fouji) లాంటి సినిమాలతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇప్పటికే సలార్ సినిమాతో 700 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టింది. కాబట్టి ఈ సినిమా కి సీక్వెల్ గా రానున్న సలార్ 2(Salaar 2) మూవీ మీద మంచి అంచనాలున్నాయి… ఇక దానికి తగ్గట్టుగానే సలార్ 2 సినిమాని కూడా తొందరలో సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు.
కాబట్టి ఈ సినిమా పూర్తయిన వెంటనే 2026 ఎండింగ్ నుంచి సలార్ 2 సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 2027 చివర్లో ఆ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. మరి ఈ గ్యాప్ లోనే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగతో చేయబోతున్న స్పిరిట్ (Spirit) సినిమాని కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read : సలార్ 2 లో పృధ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ చనిపోతుందా..? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్…
ఇక ఏది ఏమైనా కూడా సలార్ 2 సినిమాను 2027 లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం ఏ సినిమా చేసిన కూడా భారీ విజయాన్ని సాధిస్తోంది. కాబట్టి ఆయన మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.
మరి ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కాబట్టి ఆ హీరోల ఇమేజ్ కి తగ్గట్టుగా మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు… ఇప్పటివరకు ఆయన చేసినవి తక్కువ సినిమాలే అయినా కూడా మంచి విజయాలను సాధించి ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపుని తీసుకొచ్చినవే కావడం విశేషం..