Argentina vs England : ఆటలు కేవలం ఆటలు కావు.. వాటి వెనుక రాజకీయాలు ఉంటాయి. జియో పాలిటిక్స్ ఉంటాయి. రెండు దేశాల మధ్య ఉన్న భావోద్వేగాలు ఉంటాయి. మైదానంలో దేశాల పతాకాలు రెపరెపలాడుతున్నప్పుడు జాతీయ వాదానికి ఊపిరిపోస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దేశాలు ఎట్టి పరిస్థితిలో మ్యాచ్ గెలవాలని చూస్తుంది. ముఖ్యంగా భారత్–పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు సిరీస్ గెలవకపోయినా మంచిదే కానీ పాకిస్తాన్‌పై ఓడిపోవద్దని భారత అభిమానులు కోరుకుంటారు. ఇక ఈసారైనా భారత్ చేతిలో ఓడిపోకుండా చూడు అల్లా అని పాకిస్తానీలు కోరుకుంటారు. తాజాగా ఇలాంటి హై ఓల్టేజీ మ్యాచ్ ఇంగ్లండ్–అర్జెంటీనా మధ్య జరిగింది. ప్రపంచకప్ ఫుట్‌బాల్ సిరీస్‌లో చిరకాల ప్రత్యర్థులు సెమీ ఫైనల్‌లో తలపడ్డారు. అర్జెంటీనా లాటిన్ అమెరికా దేశం. ఇంగ్లండ్ ప్రాచీన యురోపియన్ దేశం. ఈ రెండు మధ్య వైరం, శత్రుత్వం ఉంది. పోటీకి చాలా ప్రాముఖ్యత ఉంది.
మాల్వినాస్ వివాదం చరిత్ర ఇదీ..
మాల్వినాస్/ఫాక్‌లాండ్ దీవులపై ద్రౌహిక వాదన రెండు దేశాల మధ్య శతాబ్దాల చరిత్ర. 19వ శతాబ్దం చివరవరకు ప్రాంతం స్థానిక, కొన్నిసార్లు స్పానిష్ హోదాలో ఉండి, తరువాత బ్రిటిష్ నౌకిక కార్యకలాపాల కారణంగా పరిణతమైంది. అర్జెంటీనాకు 1816లో స్వాతంత్య్రం వచ్చింది. స్పెయిన్‌తో పోరాడి స్వాతంత్రం తెచ్చుకుంది. స్పెయిన్ ఆధినంలో ఉన్న భూభాగాలు అర్జెంటీనాకు అప్పగించింది. మొత్తం అర్జంటీనా భూమితోపాటు చిన్న ద్వీపం ఉంది. అదే మాల్వినా. ఇది అర్జెంటీనాలు అంతర్భాగం. దీనిని 1826లో లూయీ వెర్నీని పంపి అక్కడ కాలనీ ఏర్పాటు చేసింది. అర్జంటీనా పాలనలో కొనసాగింది. హాయిగా నడుస్తున్న సమయలో 1833లో బ్రిటిష్ యుద్ధ నౌక హెచ్‌ఎన్‌ఎస్ క్లియో అర్జంటైనా వచ్చి ద్వీపంలో దిగింది. తుపాకీ చూపించి వెర్నియాలో ఉన్న ప్రజలను బ్రిటన్ పౌరులుగా ప్రకటించింది. అర్జంటీనా ఆందోళన చేసింది. కానీ ఇంగ్లండ్ ఇవ్వలేదు. ద్వీపం పేరు ఫాక్‌లాండ్ అని పేరు మార్చింది. గొడవ 1933 నుంచి 1982 వరకు సాగింది. 1982లో అర్జంటీనా ప్రభుత్వం తమ సైన్యాన్ని పంపి ద్వీపాన్ని ఆక్రమించుకుంది. బ్రిటిష్‌వారిని తరిమేసింది. అయితే ఇంగ్లండ్ చిన్న ద్వీపం కోసం యుద్ధం చేస్తుందని అర్జంటీనా ఊహించలేదు. కానీ ఇంగ్లండ్ యుద్ధ విమానాలు, నౌకలను పంపింది. 74 రోజులు ఈ ద్వీపం కోసం కొట్టుకున్నాయి. 649 మంది అర్జెంటీనియన్లు, 255 మంది బ్రిటిష్ సైనికులు, ముగ్గురు పౌరులు చనిపోయారు. చివరకు మళ్లీ ఇంగ్లండ్ వశమైంది.
ఇరుదేశాల మధ్య రెండు శతాబ్దాల వైరం..
అప్పటి నుంచి ఇంగ్లండ్–అర్జంటీనా మధ్య వైరం పెరిగింది. క్రీడల్లోనూ దాని ప్రభావం కనబడుతుంది. మాల్వినాను గుర్తు చేస్తూ అర్జంటీనా ఆటలు ఆడుతుంది. ప్రపంచ ఫుట్‌బాల్ సెమీ ఫైనల్‌లో తమ గెలుపును మాల్వినాకు అంకితం ఇచ్చింది. 1513 మంది ఇంగ్లండ్‌తో కలిసి ఉంటామని చెప్పారని ఇంగ్లండ్ చెబుతోంది. మాల్వినాకు ఇంగ్లండ్‌కు మధ్య 2 వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయినా ఇప్పటికీ దానిపై ఆధిపత్యం కొనసాగిస్తుంది. అందుకే ఇప్పటికీ ఆదేశాల మధ్య వైరం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య సయోధ్య మాత్రం కుదరడం లేదు.
అర్జెంటీనా పాటతో భావోద్వేగం..
ప్రపంచ కప్ ఫుట్‌బాల్ సెమీఫైనల్ ఇంగ్లండ్–అర్జెంటీనా మధ్య జరిగింది. ఇందులో అర్జెంటీన ప్లేయర్లు కసితో బరిలో దిగారు. మాల్వినాస్ అనే ద్వీపంలో ఉన్న 1800 మంది ప్రజల తరఫున పోరాడుతున్నామని పాట పాడారు. మాల్వినాస్ పాటను ఇప్పటికే సాధన చేశారు. మా ద్వీపంపై మా హక్కు అనే పాట అది. 22 మంది ప్లేయర్ల మధ్య జరిగింది ఆట కాదు ఇది ఒక జియో పాలిటిక్స్
