Homeఎంటర్టైన్మెంట్Rayalaseema Dialect In Telugu Cinema: తెలుగు సినిమాల్లో రాయలసీమ యాస కి క్రేజ్ పెరుగుతుందిగా...

Rayalaseema Dialect In Telugu Cinema: తెలుగు సినిమాల్లో రాయలసీమ యాస కి క్రేజ్ పెరుగుతుందిగా…

Rayalaseema Dialect In Telugu Cinema: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో సమయంలో ఒక్కో యాస తో వచ్చిన సినిమాలు సక్సెస్ లను సాధిస్తుంటాయి. ఇక ఈ క్రమంలోనే గతంలో గోదావరి యాసకు సంబంధించిన సినిమాల మీద ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. ఇక అర్జున్ రెడ్డి, ఫిదా లాంటి సినిమాలతో తెలంగాణ యాస మీద పట్టు పెరిగింది. దాంతో పాటుగా తెలంగాణ స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత నుంచి ఎక్కువగా తెలంగాణ యాస మీదనే సినిమాలు రావడం […]

Rayalaseema Dialect In Telugu Cinema: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో సమయంలో ఒక్కో యాస తో వచ్చిన సినిమాలు సక్సెస్ లను సాధిస్తుంటాయి. ఇక ఈ క్రమంలోనే గతంలో గోదావరి యాసకు సంబంధించిన సినిమాల మీద ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. ఇక అర్జున్ రెడ్డి, ఫిదా లాంటి సినిమాలతో తెలంగాణ యాస మీద పట్టు పెరిగింది. దాంతో పాటుగా తెలంగాణ స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత నుంచి ఎక్కువగా తెలంగాణ యాస మీదనే సినిమాలు రావడం మొదలయ్యాయి. అలాంటి సినిమాలకే ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ దక్కుతుండడంతో ప్రతి ఒక్కరు ఇప్పుడు అవే సినిమాలను చేస్తున్నారు. ఇక కొత్తగా రాయలసీమ యాస తో వచ్చిన సినిమాలకు సైతం ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. మా ఇంటి బంగారం సినిమాలో రాయలసీమ యాస ను పెట్టి సూపర్ సక్సెస్ ను సాధించారు.

లెనిన్ సినిమాలో సైతం రాయలసీమ యాస కి పెద్దపీట వేశారు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో వస్తున్న ‘రణబాలి’ సినిమాలో సైతం రాయలసీమ యాస లోనే మాట్లాడబోతున్నారు. ఇప్పుడు అక్కడి యాసకి మంచి డిమాండ్ పెరుగుతుంది.

ఇక ఏది ఏమైనా కూడా ఇది ఎన్ని రోజులపాటు సినిమా ఇండస్ట్రీ మీద ప్రభావం చూపించగలుగుతుంది. తద్వారా ఆ తర్వాత ఎలాంటి యాస పెట్టడానికి మన మేకర్స్ ప్రయత్నిస్తున్నారనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తూ ఉండడం విశేషం…

ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన ఏ కొత్త మార్పు వచ్చినా కూడా అది తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మొదలవుతుండడం వల్ల మన ఇండస్ట్రీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు… మొత్తానికైతే సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిలుపడానికి మన మేకర్స్ డిఫరెంట్ ప్రయోగాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు… చూడాలి మరి రాబోయే రోజులో ఇంకా ఎలాంటి సినిమాలు వస్తాయి మన ప్రేక్షకులు వాటిని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper