
రాష్ట్రంలో కొవిడ్ వైద్య చికిత్సలపై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కరోనా చికిత్సలు సక్రమంగా అందడం లేదంటూ సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు,ఏపీసీఎల్ ఏ వేసిన పిల్ పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కరోనా నియంత్రణకు రాష్ట్ర సర్కారు తీసుకున్న చర్యలను ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థిని అమికస్ క్యూరీ తెలిపారు. పడకల లభ్యత, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజుల వసూలు అంశాలపై హైకోర్టు విచారణ కొనసాగిస్తోంది.